ETV Bharat / state

తెలంగాణలో మళ్లీ దొరల పాలన: విజయశాంతి - నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారం

నాగార్జునసాగర్​ ఉపఎన్నికలో పార్టీల ప్రచారం రోజురోజుకు వేడెక్కుతోంది. భాజపా అభ్యర్థి తరఫున విజయశాంతి ప్రచారంలోకి దిగారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్​పై రాములమ్మ ఫైర్​ అయ్యారు.

vijayashanti
తెలంగాణలో మళ్లీ దొరల పాలన: విజయశాంతి
author img

By

Published : Apr 12, 2021, 1:50 PM IST

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారంలో భాజపా అగ్రశ్రేణి నాయకులను రంగంలోకి దింపుతుంది. నేడు తిరుమలగిరి మండలం నెల్లికల్​, పిల్లిగుండ్ల తండా, సభావత్​ తండా, నాయకుని తండా, తిమ్మాయి పాలెంలో భాజపా అభ్యర్థి తరఫున విజయశాంతి ప్రచారంలో దిగారు.

తెలంగాణలో దొరలపాలన నడుస్తోందని విజయశాంతి ఆరోపించారు. సామాన్య ప్రజలను పట్టించుకునే స్థితిలో తెరాస నాయకులు లేరని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం ఓ మహిళా ప్రజాప్రతినిధిగా కొట్లాడినట్లు గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎందరో అమరులు వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా.. ఆత్మ బలిదానం చేస్తే... మళ్లీ దొరలు పాలిస్తున్నారని ధ్వజమెత్తారు.

సీఎం కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని... మాటతప్పినట్లు పునరుద్ఘాటించారు. ప్రజలు ఆయన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని అన్నారు. భాజపా అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.