ETV Bharat / state

యాదాద్రి థర్మల్ విద్యుత్‌ కేంద్రంపై విజిలెన్స్ ఫోకస్ - కీలక పత్రాలు స్వాధీనం

Vigilance Focus on Yadadri Thermal Power Plant : నల్గొండ జిల్లాలోని వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంపై రాష్ట్ర విజిలెన్స్‌ బృందం దృష్టి సారించింది. ప్లాంట్ నిర్మాణం, టెండర్ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం ఇద్దరు ఉన్నతాధికారులు కీలక పత్రాల స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా నిర్వాసితులకు పరిహారం చెల్లింపులపై త్వరలోనే విచారణ చేపటనున్నట్లు తెలిసింది.

Yadadri Thermal Power Plant
Yadadri Thermal Power Plant
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 19, 2024, 11:14 AM IST

Vigilance Focus on Yadadri Thermal Power Plant : నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న యాదాద్రి సూపర్‌ క్రిటికల్‌ అల్ట్రా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంపై రాష్ట్ర విజిలెన్స్‌ బృందం ఫోకస్ పెట్టింది. ప్లాంట్ నిర్మాణం, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు, టెండర్ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఇటీవల శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నేపథ్యంలో ప్లాంట్‌లోని పలు కీలక పత్రాలను రాష్ట్ర విజిలెన్స్‌ శాఖకు సంబంధించిన ఇద్దరు ఉన్నతాధికారులు రెండు రోజుల క్రితం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్లాంట్ నిర్మాణ సమయం నుంచి జరిగిన భూ సేకరణ, నిధుల కేటాయింపు, వ్యయాలకు సంబంధించిన దస్త్రాలు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే పూర్తిస్థాయి విజిలెన్స్‌ బృందం క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంది. పనుల పర్యవేక్షణతో పాటు ప్లాంట్ నిర్మాణంలో ఇప్పటి వరకు కీలకంగా వ్యవహరించిన అధికారులను ప్రశ్నిస్తుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

పెరిగిన అంచనా వ్యయం : కృష్ణా పరీవాహక ప్రాంతమైన వీర్లపాలెంలో విద్యుత్‌ కేంద్ర నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2015 జూన్‌ 8న భూమిపూజ చేశారు. తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో 4000ల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో, రూ.28,000ల కోట్ల అంచనా వ్యయంతో 2017లో ఈ నిర్మాణాన్ని ప్రారంభించారు. నిర్మాణం ఆలస్యం కావడంతో ప్రస్తుతం ఈ వ్యయం రూ.55,000ల కోట్ల వరకు పెరిగింది.

Yadadri thermal power plant: యాదాద్రి వెలిగేదెప్పుడో.. నత్తనడకన థర్మల్ విద్యుత్​ కేంద్రం పనులు

పరిహారం చెల్లింపులపై ఆరోపణలు : ఒక్కోటి 800 మెగావాట్ల సామర్థ్యంతో ఐదు విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం, బూడిద నిల్వలు, బొగ్గు, రిజర్వాయర్‌, ఇతర ప్లాంట్ అవసరాల నిమిత్తం ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు 4,200 ఎకరాలను కేటాయించింది. ఇందులో ప్రభుత్వ, అటవీ, పట్టా భూములున్నాయి. అటవీ భూములకు బదులుగా మరోచోట భూములను కేటాయించారు. పట్టా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఎకరాకు గరిష్ఠంగా రూ.6.5 లక్షలను పరిహారంగా నిర్ణయించారు. ఈ పరిహారం చెల్లింపులలో భారీగా అక్రమాలు జరిగినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. భూములు కోల్పోని స్థానిక గిరిజనుల పేర్లతో పరిహారాన్ని అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారులు పంచుకున్నారని నిర్వాసితులు ఆరోపించారు.

Yadadri Thermal Power Plant in Nalgonda District : ప్లాంట్ ప్రధాన పనులను బీహెచ్‌ఈఎల్‌ (భెల్‌)కు అప్పగించారు. ఇప్పటి వరకు 50 శాతమే పూర్తయినట్లు సమాచారం. అంచనా వ్యయంలో 80 శాతం నిధులు వెచ్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు చేసిన ఖర్చుపై జెన్‌కో అధికారులు మొదటి నుంచి గోప్యత పాటిస్తున్నారు. 2015 నుంచి 2023 వరకు నిర్వాసితులకు రూ.100 కోట్ల మేర చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ చెల్లింపులపై కూడా అధికారుల నుంచి స్పష్టత కరువైంది.

Yadadri power plant: యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్వాసితుల తరలింపు పూర్తి

Yadadri Power Plant Issues : విజిలెన్స్‌ వారు భూ పరిహారం విభాగం వ్యవహారాలు చూసిన మిర్యాలగూడ డివిజన్‌లోని రెవెన్యూ వారిని, జెన్‌కోలోని సంబంధిత అధికారులను విచారించే అవకాశం ఉందని తెలిసింది. మరోవైపు విద్యుత్‌ బాయిలర్ల నిర్మాణం, ఇతర పనుల కోసం సుమారు రూ.20,000ల కోట్ల విలువైన టెండర్లను, తమకు అనుకూలమైన సంస్థలకే దక్కే విధంగా జెన్‌కోలోని కీలక అధికారులు వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపైనా విజిలెన్స్‌ బృందం సమగ్ర సమాచారాన్ని సేకరిస్తోంది.

ఫిబ్రవరి 20న ప్రజాభిప్రాయ సేకరణ : మరోవైపు ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ పూర్తిస్థాయిలో అనుమతులు మంజూరు చేయలేదు. దీంతో వచ్చే నెల 20న పెండింగ్‌లో ఉన్న అనుమతుల కోసం అధికారులు మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నారు.

Yadadri Power Plant TOR Issue : యాదాద్రి ప్లాంట్ టీఓఆర్ జారీపై నెలకొన్న అనిశ్చితి.. థర్మల్ విద్యుత్​కు మోక్షం ఎప్పుడో..?

ఆ అంశాలపై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖకు నివేదిక పంపాలని జెన్​కో నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.