నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలోని లక్ష్మణపురం గ్రామ పునరావాస బాధితులు డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన కిష్టారాయిన్పల్లి జలాశయ పనులను అడ్డుకున్నారు. లక్షణాపురం గ్రామం ఈ ప్రాజెక్టులో భాగంగా పూర్తిగా ముంపునకు గురవుతోంది. తమను అదుకుని పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ పనులను బహిష్కరించారు. ప్రాజెక్టు శంకుస్థాపన రోజు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చిన తర్వాతే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చూడండి : ఉస్మానియాకు సంబంధించిన అన్ని వ్యాజ్యాలు కలిపి విచారిస్తాం: హైకోర్టు