Venkata Reddy letter to Priyanka Gandhi: రాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ నేతల అసంతృప్తి, ఆధిపత్య పోరు ఇంకా కొనసాగుతునే ఉంది. ఇందుకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ దానికి మరింత బలం చేకూర్చుతోంది. తాజాగా ఆయన తెలంగాణ కాంగ్రెస్పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీని పార్టీ నుంచి బహిష్కరించాలని కోరుతూ ఆ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీకి లేఖ రాశారు.
షబ్బీర్ అలీకి చీటింగ్, ఇతర కేసులలో ప్రమేయం ఉందని ఆయన్ని ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చునని ఇదే విషయం తాను ప్రియాంక గాంధీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన స్పష్టం చేశారు. వెంటనే పార్టీ క్రమశిక్షణా చర్య కమిటీ నుంచి షోకాజ్ నోటీసు పంపాలని కోరుతున్నట్లు ఆయన వివరించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే పార్టీకి నష్టం కలుగుతుందని కోమటి రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి: