యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో వైద్యురాలి నిర్లక్ష్యంతో ప్రసవం కోసం వచ్చిన మహిళ మరణించింది. తమకు న్యాయం చేయాలంటూ మృతురాలి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. నార్కట్‌పల్లి మండలం కొండాపాకగూడెం గ్రామానికి చెందిన 26ఏళ్ల మానస..గత నెల 14న ప్రసవం కోసం రామన్నపేటలోని విజయ ఆసుపత్రికి వచ్చింది. వైద్యురాలు విజయలక్ష్మి ఆమెకు శస్త్రచికిత్స చేసింది. అధిక రక్తస్రావం కావటం వల్ల హైదరాబాద్ వెళ్లాలని సూచించింది. ఎల్బీనగర్లోని శ్రీకర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించటం వల్ల ఈ రోజు ఉదయం మహిళ మరణించింది. వైద్యురాలి నిర్లక్ష్యంతోనే మహిళ మరణించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ... బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
ఇవీ చూడండి: కత్తులతో భయపెట్టిన ఐదుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు