నామినేషన్ దాఖలు చేసిన ఉత్తమ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచన మేరకు నల్గొండలో ఎంపీగా నామినేషన్ దాఖలు చేసినట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మధ్యాహ్నం పార్టీ అనుచరులతో కలిసి నామపత్రాలు సమర్పించారు.
మతపరంగా విభజించే కుట్రలు... నరేంద్రమోదీ దేశాన్ని మతపరంగా విభజించే కుట్రలు చేస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. ముస్లిం సంప్రదాయాలు, చట్టాల్లో జోక్యం చేసుకుని వారిలో అభద్రతా భావాన్ని పెంచారని ఆరోపించారు.
ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని.. రాహుల్ ప్రధాని అవుతారని పీసీసీ అధ్యక్షుడు జోస్యం చెప్పారు.
ఇవీ చూడండి:లోక్సభకు పోటీ చేయాలా? వద్దా? సందిగ్ధంలో తెజస