నల్గొండ జిల్లా నార్కట్పల్లి డిపోలో విధుల్లో చేరడానికి వచ్చిన 43 మంది ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. డిపో మేనేజర్‌కి వినతి పత్రాలు ఇస్తామన్నా అనుమతి లేదంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. విధుల్లో చేరడానికి వస్తే అన్యాయంగా అరెస్టులు చేస్తన్నారంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: డిపోలకు వస్తున్న కార్మికులు... అడ్డుకుంటున్న పోలీసులు..