పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లు కైవసం చేసుకోవడంతో నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో తెరాస శ్రేణులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. నల్గొండ జిల్లా అనుముల మండలం రామడుగులో పలువురిని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను చూసి విద్యావంతులు తెరాసకు పట్టం కట్టారని ఎమ్మెల్యే కోనేరు కొనప్ప అన్నారు. సాగర్ ఉప ఎన్నికల్లో కూడా తెరాస విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడంతో హాలియా, త్రిపురారంలో తెరాస శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. ఈ వేడుకల్లో ఇంఛార్జ్ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, త్రిపురారంలో తెరాస పార్టీ కార్యదర్శి ఎన్నికల ఇంఛార్జ్ తక్కెళ్ల పల్లి రవీందర్ రావు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.