తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని సాగర్ తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ అన్నారు. సీఎం, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోనే తన తండ్రి ఎమ్మెల్యేగా గెలుపొందారని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని బూనుతల, కుంకుడు చెట్టు తండాల్లో భగత్ ప్రచారం నిర్వహించారు. తనను ఆశీర్వదించి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని.. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఓటర్లను భగత్ కోరారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే...
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని తెరాస మండల ఇన్ఛార్జీ, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ఆ పార్టీకి ఓటేస్తే ఎటువంటి ఉపయోగం ఉండదని ఎద్దేవా చేశారు. తండాలకు లిఫ్ట్ మంజూరు చేసి చివరి భూములకు సైతం సీఎం నీళ్లలందిస్తున్నారని పేర్కొన్నారు. ఇస్త్రీ షాపులకు ఉచిత కరెంటు ఇస్తున్నట్లు గుర్తు చేశారు. ప్రచారంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: సాగర్ ఉపఎన్నిక బరిపై.. యువత గురి