ETV Bharat / state

వ్యవసాయ చట్టాలతో రైతు మనుగడకే ప్రమాదం : ముదిరెడ్డి - నల్గొండ జిల్లా కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ

రైతులకు మద్దతుగా సీపీఎం ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో పలు రైతు సంఘాలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీకి మద్దతుగా సంఘీభావం తెలిపారు.

tractors ryali in nalgonda to support farmers in delhi
నల్గొండ జిల్లాకేంద్రంలో రైతులకు మద్దతుగా ట్రాక్టర్ల ర్యాలీ
author img

By

Published : Jan 26, 2021, 5:11 PM IST

కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలతో రైతుల మనుగడ ప్రమాదంలో పడే అవకాశం ఉందని నల్గొండ సీపీఎం జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్​ రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో పలు మండలాలకు చెందిన రైతు సంఘాలతో కలిసి ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ సంస్కరణల పేరుతో రైతుల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. దిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీకి మద్దతుగా సంఘీభావం తెలిపారు.

దేశ రాజధాని దిల్లీలో 250 రైతు సంఘాలు రెండు నెలలుగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా.. ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తామన్న కేసీఆర్ కేంద్రానికి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ఐకేపీ సెంటర్లు ప్రారంభించేవరకు తమ పోరాటం ఆగదని సుధాకర్​ రెడ్డి హెచ్చరించారు.

ఇదీ చూడండి : దిల్లీ రైతు ఉద్యమానికి మద్దతుగా ట్రాక్టర్ ర్యాలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.