ETV Bharat / state

బదిలీలు, పదోన్నతులు కల్పించాలి: కోదండరాం - కోదండరాం తాజా వార్తలు

ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు కల్పించాలని తెజస అధ్యక్షుడు కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులు చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతు పలికారు.

tjs president kodandaram demand for prc to teachers in naglonda
బదిలీలు, పదోన్నతులు కల్పించాలి: కోదండరాం
author img

By

Published : Dec 17, 2020, 3:52 PM IST

నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్​లో ఉపాధ్యాయులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నిరసనకు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని అన్నారు.

రాష్ట్రం ఏర్పడిన నుంచి ఉపాధ్యాయుల ప్రమోషన్లు.. నాలుగు సంవత్సరాల నుంచి బదిలీలు పెండింగ్​లో ఉన్నట్లు చెప్పారు. 2018 ఎన్నికల్లో ముఖ్యమంత్రి బదిలీలపై ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. 2018 పీఆర్​సీ కూడా అమలు కాలేదన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని ఖండిస్తున్నామన్నారు. పీఆర్​సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి: పోలీసుల హైడ్రామా మధ్య జనభేరి సభకు చంద్రబాబు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.