నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెజస అధ్యక్షుడు ప్రొ.కోదండరాం నల్గొండ పట్టణంలో పర్యటించారు. పలు ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయులు, పట్టభద్రులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో మాట్లాడారు.
ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని కోదండరాం ఆరోపించారు. ఇప్పటి వరకు 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెబుతున్నారని.. వాస్తవానికి ప్రభుత్వం భర్తీ చేసింది 70 వేల ఉద్యోగాలు మాత్రమేనని ఆరోపించారు. అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.7 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్.. ఇప్పటికీ ఆ హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు.
ఉద్యోగాలు ఇవ్వడం కంటే.. ఉన్నవారిని తొలగించడమే ఎక్కువగా ఉందని విమర్శించారు. నిరుద్యోగులంతా ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. అదే తమకు అనుకూలిస్తుందని అన్నారు. ఈ ఎన్నికలో గెలుపు తనదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: తెరాసకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి