ఇండిక్యాష్ ఏటీఎంలో దొంగతనం.. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఇండిక్యాష్ ఏటీఎం సెంటర్లో చోరీ జరిగింది. గ్యాస్ కట్టర్లతో ఏటీఎం మిషన్ ధ్వంసం చేసి.. నగదు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఎంత నగదు పోయింది అనే విషయంపై వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలిస్తున్నారు. ఇవీ చూడండి: ప్రాణం పోసే అంబులెన్సే.. ప్రాణం తీసింది!