ETV Bharat / state

కేసీఆర్ మాయ మాటలు నమ్మకండి: తీన్మార్ మల్లన్న - అక్రమ కేసులు

తీన్మార్ మల్లన్న నల్గొండలోని పలు మండలాల్లో పర్యటించారు. కేసీఆర్​ది.. నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వమన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి.. అవకాశమివ్వాలని కోరారు.

theenmar malanna mlc election campaign in nalgonda
కేసీఆర్ మాయ మాటలు నమ్మకండి: తీన్మార్ మల్లన్న
author img

By

Published : Dec 24, 2020, 4:47 PM IST

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తీన్మార్ మల్లన్న.. నల్గొండలోని హాలియా, పెద్దవూర మండలాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్రం కేసీఆర్ ఒక్కడి వల్ల రాలేదన్నారు. ఎందరో మేధావులు, విద్యార్థులు బలిదానాల వల్లే అది సాధ్యమైందన్నారు. తెరాస ప్రభుత్వం.. నిరుద్యోగులకు అన్యాయం చేస్తోందని వివరించారు. కేసీఆర్ మాయ మాటలను నమ్మొద్దని కోరారు.

రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు మల్లన్న. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. తెరాస నాయకులు తనపై భౌతిక దాడులకు పాల్పడ్డారన్నారు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి.. అవకాశమివ్వాలని కోరారు.

ఇదీ చదవండి: కేసీఆర్​కు ఎన్నికల భయం పట్టుకుంది: తీన్మార్ మల్లన్న

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.