నల్లగొండ జిల్లా చండూరు మండలం ఇడికూడ గ్రామానికి చెందిన బుర్ర శ్రీను పాము కాటుకు గురై మృతిచెందాడు. శనివారం రాత్రి ఇంటి ముందు నిద్రిస్తుండగా పాటు కాటేసింది. ఇంట్లో వాళ్లకు విషయం చెప్పటంతో 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయామని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇవీ చూడండి: 'మహీ.. మరిన్ని విజయాలతో సాగిపో...'