నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలో చేపల వేట, అమ్మకాలతో సందడి వాతావరణం నెలకొంది. శాలిగౌరారం ప్రాజెక్టులో పెద్ద పెద్ద చేపలు వలలకు చిక్కడంతో మత్స్యకారులు పండుగ చేసుకున్నారు. ఈ ప్రాజెక్టు రైతులతోపాటు వందల మంది మత్స్యకార్మికులకు జీవనాధారంగా ఉపయోగపడుతోంది.
కొవిడ్ కారణంగా కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్టులో చేపలు పట్టడంలేదు. ఆదివారం రోజున మత్స్య కార్మికులు వేట ప్రారంభించారు. భారీ చేపలు వలలకు చిక్కడంతో మత్స్యకారుల పంట పండింది. అనేక గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు చేపలను కొనుక్కుని వెళ్లారు. కొందరయితే జలాశయం వద్దకే వెళ్లి చేపలను కొనుగోలు చేశారు. దీంతో జలాశయం వద్ద సందడి నెలకొంది. ఏకంగా 60 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేయాల్సి వచ్చింది.
ఇదీ చదవండి: నేడు మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం