చెర్వుగట్టులో వైభవంగా అగ్ని గుండాలు నల్గొండ జిల్లా చెర్వుగట్టులోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మార్మోగింది. తెల్లవారుజామున గుట్టపైన అగ్ని గుండాల కార్యక్రమం నిర్వహించారు. శివ సత్తులు, భక్తులు ఓం నమః శివాయ మంత్రం.. స్మరిస్తూ నిప్పుల్లో నడిచారు. కార్యక్రమంలో పాల్గొనడానికి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కోనేరులో స్నానాలు చేసి అగ్ని గుండంలో నడిచిన అనంతరం స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం ఆలయ వీధుల్లో కోలాట నృత్యాలు, శివనామ స్మరణ నడుమ కోనేరు వద్ద పంచహారతులిచ్చారు. గర్భగుడిలో, మూడుగుండ్లపై స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు గంటల తరబడి క్యూలైన్లో నిల్చున్నారు. శివసత్తులు బోనాలతో సందడి చేశారు.