RS Praveen kumar on trs government: ఇండస్ట్రీయల్ పార్క్ పేరుతో పంటలు పండే భూములను లాక్కుంటున్నారని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల అనుమతి లేకుండా వారి భూముల్లోకి ఎలా వచ్చారని ప్రశ్నించారు. రైతుల నోట్లో మట్టికొట్టడం ఆపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో ఇండస్ట్రీయల్ పార్క్ కోసం భూములు కోల్పోతున్న రైతులను పరామర్శించారు. భూములు కోల్పోతున్న రైతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
దాదాపుగా అరవై, డెబ్బై సంవత్సరాల నుంచి ఈ భూమిలో సాగు చేసుకొని బతుకుతున్నారు. వాళ్లకు వేరే మార్గం లేదు. ఇండస్ట్రీల్లో పనిచేసే కూలీలు కూడా ఇక్కడి వాళ్లు కాదు. ఆఫీసర్లు ఇక్కడివాళ్లు కాదు. ఎక్కడినుంచో బయట నుంచి తీసుకొచ్చి తెలంగాణ బిడ్డల నోట్ల మట్టికొట్టడం కోసమే ఈ ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చారని అనిపిస్తోంది.
ఆర్‌ఎస్. ప్రవీణ్ కుమార్, బీఎస్పీ రాష్ట్ర సమన్వయ కర్త
RS Praveen kumar veliminedu visit: స్థానిక మంత్రి, ఐటీ మంత్రికి తెలియకుండా ఈ భూ సేకరణ జరుగుతోందా..? అని ప్రశ్నించారు. పీజీలు చేసి ఉద్యోగాలు లేక.. ఉన్న భూమిని నమ్ముకొని బతుకుతున్న వాళ్ల భూములను లాక్కొవడం దారుణమన్నారు. ఇండస్ట్రీయల్ పార్క్ కోసం పేద రైతుల భూమిని లాక్కునే బదులు... నాయకుల ఫాంహౌస్ ధారాదత్తం చేయాలని ఎద్దేవ చేశారు. వెంటనే ఈ భూ సేకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని... భూమిని నమ్ముకొని బతుకున్న వారికి న్యాయం చేయాలన్నారు
అర్జెంట్‌గా ఈ భూసేకరణ ప్రక్రియ ఆగాలి. రైతుల అనుమతి లేకుండా ఎవరూ ఎంటర్ కావొద్దు. ప్రజాప్రయోజనార్థం అంటే ప్రజలను కాదని.. వాళ్ల సొంత ఆస్తుల్లోకి ఎలా వస్తారు. వాళ్ల జీవనోపాధిని కాపాడుకోవాలి. రైతుల నోట్లో మట్టికొట్టడం ఆపాలి. ఇండస్ట్రీయల్ పార్కు కావాలంటే మీ ఫాంహౌస్‌లు ఉన్నాయి. వాటినే మొత్తం ధారాదత్తం చేయండి. ఎవరు కాదన్నారు.
ఆర్‌ఎస్. ప్రవీణ్ కుమార్, బీఎస్పీ రాష్ట్ర సమన్వయ కర్త
ఇదీ చదవండి: women's protest against liquor: 'ఇళ్ల మధ్య మద్యం షాపు.. వద్దు.. వద్దు..'