ETV Bharat / state

MLA Rajagopal reddy resignation : రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదించిన స్పీకర్​ - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి న్యూస్ అప్​డేట్స్

MLA Rajagopal reddy resignation : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎట్టకేలకు తన రాజీనామాను తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి సమర్పించారు. మునుగోడు ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్ రెడ్డి సమర్పించిన లేఖను స్పీకర్ ఆమోదించారు. ఈ విషయాన్ని కోమటిరెడ్డి స్వయంగా వెల్లడించారు. అసెంబ్లీకి వెళ్లేముందు రాజగోపాల్ రెడ్డి గన్​పార్కు వద్ద అమరవీరు స్థూపానికి నివాళులర్పించారు.

MLA Rajagopal reddy resignation
MLA Rajagopal reddy resignation
author img

By

Published : Aug 8, 2022, 11:13 AM IST

Updated : Aug 8, 2022, 11:19 AM IST

MLA Rajagopal reddy resignation : మునుగోడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి సమర్పించారు. తన రాజీనామాను స్పీకర్ పోచారం ఆమోదించారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అంతకుముందు గన్​పార్కుకు చేరుకున్న రాజగోపాల్​ రెడ్డి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

MLA Rajagopal reddy resignation
రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదించిన స్పీకర్​

Munugodu MLA Rajagopal reddy resignation : తెరాస.. తెలంగాణ ద్రోహుల పార్టీ అయిందని మునుగోడు రాజగోపాలరెడ్డి విమర్శించారు. తెరాస, కాంగ్రెస్‌ పార్టీల్లో ఉన్న చాలా మంది నేతలు తనతో మాట్లాడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తెరాస ప్రభుత్వంపై ధర్మయుద్ధం ప్రకటించానని.. దీనిలో తెలంగాణ, మనుగోడు ప్రజలు గెలుస్తారని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. చండూరు సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఆయన మనుషులు మాట్లాడిన భాష విన్న తర్వాత తెలంగాణ సమాజం తల దించుకుంటోందన్నారు. అలాంటి వ్యక్తి పార్టీ అధ్యక్షుడని.. సీఎం అవుతారంట అని వ్యాఖ్యానించారు.

‘'డబ్బులిచ్చి పదవులు తెచ్చుకున్నవాళ్లు.. తప్పుడు పనులతో జైలుకెళ్లి వచ్చినవారు మాట్లాడుతున్నారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఏ త్యాగం చేయకుండా.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనకుండా ఇప్పుడు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మరని చెప్పారు. కోమటిరెడ్డి సోదరులను తిట్టించిన భాష విన్న తర్వాత అందరూ ఆలోచించాలి’’ అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

"ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. నిరుద్యోగులు, ప్రజలకు వైద్యం, పేదలకు ఇళ్లు, పింఛన్ల కోసం రాజీనామా చేశా. నేను రాజీనామా అనగానే గట్టుప్పల్‌ మండలం ఏర్పాటు చేస్తున్నారు. సీఎంకు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌ తప్ప ఇతరుల నియోజకవర్గాలు కనిపించడం లేదు. ప్రాజెక్టులు కట్టొద్దని మేం చెప్పలేదు. రైతులకు రూ.లక్ష రుణమాఫీ ఏమైంది? మిషన్‌ భగీరథలో రూ.25వేల కోట్లు దోచుకున్నది నిజం కాదా? జీతాలు ఇవ్వాలంటే అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తెరాస తెలంగాణ ద్రోహుల పార్టీగా మారింది. మంత్రులు గంగుల కమలాకర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పువ్వాడ అజయ్‌ ఉద్యమకారులా? తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు." - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే

'అరాచక పాలనకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నాను. నేడు కేసీఆర్ కుటుంబం అరాచక పాలన సాగిస్తోంది. నేను రాజీనామా చేస్తున్నా అంటే కేసీఆర్ దిగి వస్తున్నారు. నా రాజీనామాతో మునుగోడు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇస్తారు. తెలంగాణకు కేసీఆర్ నుంచి విముక్తి కల్పిస్తారు. అభివృద్ది కోసం కేసీఆర్​ను కలవాలని చూస్తే అపాయింట్​మెంట్ ఇవ్వలేదు.' అని రాజగోపాల్ రెడ్డి వాపోయారు.

Last Updated : Aug 8, 2022, 11:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.