ETV Bharat / state

'ఆ జీవో అమలైతే తెలంగాణ శాశ్వతంగా తన హక్కులు కోల్పోతుంది'

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 203 జీవో వల్ల తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్​ కోదండరాం అన్నారు. నల్గొండ జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించిన ఆయన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

kodamdaram press meet
'ఆ జీవో అమలైతే తెలంగాణ శాశ్వతంగా తన హక్కులు కోల్పోతుంది'
author img

By

Published : May 14, 2020, 5:42 PM IST

Updated : May 14, 2020, 6:02 PM IST

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 203 జీవో అమలైతే తెలంగాణ రాష్ట్రం శాశ్వతంగా తన హక్కులను కోల్పోతుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్​ కోదండరాం పేర్కొన్నారు. దీని వల్ల తెలంగాణలో నల్గొండ జిల్లా తీవ్రంగా నష్టపోతుందని తెలిపారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు తగదన్నారు.

నల్గొండ జిల్లాలోని పలు మండలాల్లో ప్రొఫెసర్​ కోదండరాం పర్యటించారు. నార్కట్ పల్లి, కట్టంగూర్, తిప్పర్తి మండలాల్లోని బత్తాయి, నిమ్మ రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో రైతుల పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం సూచించిన పంటలు వెయ్యకపోతే రైతుబంధు రాదనడం సమంజసం కాదని... ఎప్పుడు ఏ పంట వేయాలో రైతుకు సూచించడం తగదని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెజస జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

'ఏపీ ప్రభుత్వం 203 జీవో జారీ చేసిన తర్వాత మనం నీళ్లను పొందే ఆశ మొత్తం పోయింది. ఈ జీవో అమలైతే శ్రీశైలం డ్యాం నెలరోజుల్లో ఖాళీ అయిపోతుంది. తెలంగాణ తన హక్కులను శాశ్వతంగా కోల్పోతుంది. అందువల్ల చాలా తీవ్రంగా నష్టపోయే జిల్లా ఏదైనా ఉందంటే అది నల్గొండ జిల్లా. రాబోయే రోజుల్లో ఎస్​ఎల్​బీసీ ద్వారా తెలంగాణకు రాబోయే నీటిని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. తల్లికి కొడుకు గురించి తెలిసినట్లే రైతుకు భూమి గురించి తెలుస్తుంది. రైతు అనుభవాల ఆధారంగా వ్యవసాయ శాఖ ప్రచారం చేస్తే రైతు ఆలోచించుకుని ఓ నిర్ణయానికి వస్తాడు. అంతే గాని పంట ఎట్లా వేయాలో మేమే నేర్పుతామనడం సమంజసం కాదు. ఇలాంటి నిర్ణయాలను ప్రజాస్వామ్యం.. రాజ్యాంగం ఒప్పుకోదు.'

-ప్రొఫెసర్​ కోదండరాం

ఇదీ చదవండి: కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌ను కలిసిన కాంగ్రెస్‌ నేతలు

Last Updated : May 14, 2020, 6:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.