ప్రణయ్ హత్యకేసు విచారణపై హైకోర్టు స్టే ఇచ్చింది. నల్గొండ జిల్లా కోర్టులో విచారణలో ఉన్న ప్రణయ్ పరువు హత్యకేసు విచారణ ఆపాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రణయ్ హత్య కేసు నిందితుడు మహ్మద్ అబ్దుల్ బారీ డిశ్చార్జ్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది.
డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టివేసిన నల్గొండ కోర్టు.. హైకోర్టుకు వచ్చేందుకు సమయం ఇవ్వకుండానే అభియోగాలు నమోదు చేసి విచారణ ప్రక్రియ ప్రారంభించిందని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రద్యుమ్న కుమార్ రెడ్డి వాదించారు. విచారణను ఈనెల 31కి వాయిదా వేసిన హైకోర్టు.. అప్పటి వరకు విచారణ ఆపాలని నల్గొండ కోర్టును ఆదేశించింది.
ఇదీ చూడండి: యాజమాన్య కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్