ఉమ్మడి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేయడమే ధ్యేయమని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రతి ఎకరాకు నీరిచ్చి ప్రతి రైతు కళ్లలో ఆనందం చూడడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. అందులో భాగంగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన కేసీఆర్... నెల్లికల్లులో 3వేల కోట్లతో చేపట్టనున్న ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. నెల్లికల్లులో ఒకే చోట 13 ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారు.
ఈ 13 ఎత్తిపోతల పథకాలతో ఉమ్మడి జిల్లాలోని హుజూర్నగర్, నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాల పరిధిలోని చివరి భూముల్లోకి కృష్ణా జలాలు అందుతాయని స్పష్టం చేశారు. సాగర్ జలాలతో భూములన్నీ పచ్చనిరంగు పులుముకోవాలని ఆకాంక్షించారు. స్థానిక ప్రజాప్రతినిధుల కోరిక మేరకు మాడ్గులపల్లి మండలంలో... మాడుగులపల్లి, వీర్లపాలెం, తోపుచర్లలో రాబోయే రెండు మూడు రోజుల్లో ఎత్తిపోతల పథకాలు మంజూరు చేస్తామన్నారు.
ఇదీ చదవండి: త్వరలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తాం: కేసీఆర్