నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం సుంకిశాల తండావాసులు.. నాగార్జునసాగర్-హాలియా ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. తండా పక్క నుంచే కృష్ణానది ప్రవహిస్తున్నా.. తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని ఆరోపించారు. తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు కూడా లేవని... దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు సుంకిశాల లిఫ్టు ఏర్పాటు చేస్తామని తెరాస నాయకులు హామీ ఇచ్చారు... కానీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదన్నారు. తండాలో సాగు, తాగునీరు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా... ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. సమస్య పరిష్కరించిన తర్వాతనే ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. అవసరమైతే... ఉప ఎన్నికను బహిష్కరించడానికి కూడా వెనుకాడమని హెచ్చరించారు.
ఇదీ చూడండి: 'వ్యవసాయ చట్టాలు అమలైతే రైతు బిచ్చగాడే..!'