దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా... నల్గొండ బస్ డిపో ఎదుట కార్మికులు బైఠాయించారు. బస్సులు బయటకు రాకుండా ప్రధాన ద్వారం ఎదుట నిరసనకు దిగారు. పొరుగు సేవల విధానానికి చరమగీతం పాడి కనీస వేతనాలు పెంచాలంటూ నినాదాలు చేశారు.
వామపక్షాలు, కార్మిక సంఘాలతోపాటు పురపాలిక కార్మికులు... సమ్మెలో పాల్గొన్నారు. వంద మందికి పైగా కార్మికులు బైఠాయించడం వల్ల బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
ఇవీచూడండి: కార్మిక సంఘాల ఆందోళన.. స్తంభించిన రవాణా