ETV Bharat / state

ఆ గుడిలో గాంధీకి... నిత్యపూజలు, నివేదనలు! - గాంధీ గుడి నల్గొండ

నిత్య పూజలు.. నివేదనలు.. స్తోత్రనామాలు.. ఇదంతా రామాలయమో.. శివాలయమో అనుకునేరు.. ఇవన్నీ గాంధీ ఆలయంలో జరిగే కైంకర్యాలు. మన స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకు కారణమైన గాంధీని అందరూ స్మరిస్తారు.. కానీ ఆ ఊరివారు ఏకంగా గుడే కట్టేశారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలోని గాంధీ గుడిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

ఆ గుడిలో మహాత్మాగాంధీని పూజిస్తారు..
author img

By

Published : Oct 2, 2019, 7:47 AM IST

ఆ గుడిలో మహాత్మాగాంధీని పూజిస్తారు..

ప్రపంచానికి శాంతి పాఠం బోధించి, ప్రజలను అహింస మార్గంలో నడిపించిన ఆదర్శమూర్తి మహాత్మాగాంధీ. భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చేందుకు ప్రముఖ పాత్ర పోషించారు. భారతీయులకు ఇంత చేసిన మహాత్మునికీ ఒక గుడి ఉంటే బాగుండు అని అనుకున్నారు నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి ప్రజలు. అనుకుందే తడవుగా పెద్దకాపర్తిలో గాంధీకి గుడి కట్టించారు.

ఎప్పుడు కట్టారంటే..

గుడి నిర్మాణానికి గుంటూరు జిల్లా నర్సారావుపేటకు చెందిన మహాత్మాగాంధీ చారిటబుల్ ట్రస్ట్​ 2012 గాంధీ జయంతి రోజున భూమి పూజ చేసి... 2014 సెప్టెంబరు 15న గాంధీజీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుంచి బాపూజీ నిత్యం పూజలు అందుకుంటున్నారు. ఏటా గాంధీ జయంతి రోజున హోమాలు, వ్రతాలు, ప్రత్యేక పూజలు, అన్నదానం ఘనంగా నిర్వహిస్తారు.

ఆలయం ఏమేమి ఉంటాయి..?

దేశంలోని కాశీ, కేదార్​నాథ్, బద్రీనాథ్, హరిద్వార్, తిరుపతి వంటి 30 పుణ్యక్షేత్రాల నుంచి సేకరించిన మట్టిని వివిధ పేటికల్లో అమర్చి భక్తుల సందర్శించేందుకు వీలుగా గుడి ఆవరణలో ఉంచారు. ఇక్కడ ఆరు పవిత్ర మత గ్రంథాలతో పాటు బాపూజీ రచించిన సత్యశోధన ప్రతులను భద్రపరచారు.

పంచభూతాలకు ఓ ఆలయం..

ఈ గుడిని నాలుగెకరాల సువిశాల ప్రాంతంలో నిర్మించారు. మొదటి అంతస్తులోని గర్భగుడిలో మహాత్ముడు ధ్యానముద్రలో ఆశీనుడై భక్తులకు దర్శనమిస్తారు. గుడి కిందనున్న అంతస్తులో ధ్యానమందిరం ఉంటుంది. గుడి మెట్లపైన బాపూ చెప్పిన సూక్తులు కనిపిస్తాయి. ఆలయానికి ఇరువైపులా నవగ్రహ దేవతలు, పంచభూతాల ఆలయాలు ఉంటాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ పంచభూతాలకు ఆలయం నిర్మించటం ప్రత్యేకం.

అందరూ మహాత్ముని బాటలో నడవాలని ఓ మంచి ఆశయంతో ఆలయం నిర్మించటం నిజంగా అభినందనీయం.. అటుగా వెళ్ళినపుడు మహాత్ముని గుడిని దర్శించుకుని ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభూతులను వెంట తీసుకెళ్తారంటున్నారు అహింసావాదులు.

ఇదీ చదవండిః గాంధీ 150: మహాత్ముడే ప్రారంభించిన రెండో సబర్మతి

File : TG_Hyd_17_01_Anganwadies_met_Minister_AV_3053262 From : Raghu Vardhan Note : Feed from Whatsapp ( ) ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి అంగన్ వాడీ, మినీ అంగన్ వాడీ ఉపాధ్యాయులు, ఆయాలకు దసరా పండగకు వేతనాలు ఇప్పించేలా ప్రయత్నిస్తానని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. అంగన్ వాడీ ప్రతినిధుల బృందం హైదరాబాద్ లో మంత్రిని కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. రెండు నెలల వేతనాలు రావాల్సి ఉందని, ప్రతి నెలా చివర్లో వేతనాలు ఇస్తున్నారని, పండగ ఉన్నందున నెలాఖరులో వేతనం ఇస్తే ఇబ్బంది ఉంటుందని, త్వరగా ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అంగన్ వాడీలు చాలావరకు ఒంటరి మహిళలు ఉన్నారని, వేతనాలపై ఆధారపడి పనిచేస్తున్నారని... పండగకు వేతనాలు రాకపోతే ఇబ్బంది పడతారని మంత్రికి వివరించారు. అంగన్ వాడీల సమస్యలపై స్పందించిన మంత్రి... ఇవాళ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పండగకు వేతనాలు ఇవ్వాలని కోరుతానని తెలిపారు. అంగన్ వాడీలకు సీఎం కేసిఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇప్పటికే రెండుసార్లు వేతనాలు ఎక్కడా లేనంతా పెంచారని సత్యవతి రాథోడ్ గుర్తు చేశారు. సిఎం కేసిఆర్ నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేయాలని సూచించారు. ఉద్యోగులు బతుకమ్మ ఆడుకునేందుకు మధ్యాహ్నం నుంచి వెసులుబాటు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.