Son Left His Mother in the Graveyard in Nalgonda : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామానికి చెందిన వెంకటరత్నమ్మ(70)కు కుమారుడు వెంకటేశ్, ఓ కుమార్తె ఉన్నారు. ఆమె భర్త పేరు ఏడుకొండలు. శనివారం కుమారుడు, కోడలు కలిసి వృద్దురాలి చేయి విరగొట్టి(Son Beat His Mother).. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ మండలం వాటర్‌ట్యాంక్ తండాలో ఉన్న శ్మశానవాటికలో విడిచిపెట్టి వెళ్లారు.
Son Beat His Mother in Guntur : ఇవాళ పంచాయతీ కార్మికుడు విధినిర్వహణలో భాగంగా మొక్కలకు నీరు వేసేందుకు స్వర్గధామానికి వెళ్లాడు. అనంతరం అక్కడే కొన ఊపిరితో బతికి ఉన్న ఆ వృద్దురాలిని చూసి.. గ్రామ సర్పంచ్‌కు తెలిపాడు. వెంటనే సర్పంచ్ ఆ ప్రదేశానికి వెళ్లి.. ఆమెకు ఆల్పాహారం ఇచ్చి ఆకలి తీర్చాడు. తర్వాత ఆమెను వైకుంఠ ధామం పక్కనే ఉన్న కంపోర్టు షెడ్ దగ్గరకు తీసుకువెళ్లి వివరాలు సేకరించారు.
old Women Tragedy Story in Nalgonda : సర్పంచ్, గ్రామస్థులు వృద్దురాలు శ్మశానవాటికలో గాయాలతో ఉన్న విషయాన్ని పోలీసులుకు తెలిపారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకుని ఆమె పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఇంటికి వెళితే తమ కుమారుడు, కోడలు చంపేస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆస్పత్రికి తీసుకు వెళ్లమని వేడుకొని కన్నీటి పర్యంతమైంది(Mother Tragedy Story in Nalgonda). మరింత సమాచారాన్ని ఆమె బ్యాగ్‌లో ఉన్న ఆధార్ కార్డు, రేషన్‌కార్డు ద్వారా సేకరించారు. అనంతరం చికిత్స కోసం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారాన్ని దాచేపల్లి పోలీసులకు చేరవేశామని పోలీసులు తెలిపారు. వృద్దురాలి భర్త బతికే ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు.
"వాటర్ ట్యాంక్ తండాకు చెందిన సర్పంచ్ ఓ వృద్దురాలు శ్మశానవాటికలో ఎవరో వదిలేసి వెళ్లారని సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నాను. ఆ వృద్దురాలిని వివరాలు అడిగితే.. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం అని చెప్పింది. దీంతో ఆమె సమాచారం కోసం దాచేపల్లి పోలీస్ స్టేషన్‌కు తెలియజేశాం. ఆమెను మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించాం."- ఉమాపతి, ఏఎస్ఐ
పెన్షన్ కోసం దివ్యాంగురాలి అవస్థలు.. భర్త, కుమారుడు కలిసి కావడితో కి.మీల నడక..