నల్గొండజిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరి పంట నేలకొరిగింది. మిర్యాలగూడ, వేములపల్లి, మాడుగులపల్లి, సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో వరి పంట దెబ్బతింది. పొట్ట దశలో బరువుగా ఉండే పొలం వర్షం ధాటికి నేలకొరికింది. పంట చేతికొచ్చే సమయంలో నేల పాలవడం వల్ల తాము నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి : మనసు దోచేస్తున్న మంచు తెరలు