జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నల్గొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలో ఫ్లైఓవర్ నిర్మాణంలో 500 చిరువ్యాపారుల కుటుంబాలు వీధిన పడనున్నాయి. కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారి ఎన్‌హెచ్-167 నిర్మాణంలో భాగంగా పెద్దవూర మండల కేంద్రం నుంచి నాగార్జునసాగర్, మిర్యాలగూడ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. అధికారులు మంగళవారం పనులు చేపట్టడానికి రావడంతో వారిని స్థానిక వీధి వ్యాపారులు అడ్డుకున్నారు.
ఫ్లైఓవర్ నిర్మాణంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర ఉన్న చిరు వ్యాపారుల టీకొట్లు, తినుబండారాలు, పండ్ల వ్యాపారులు ఉపాధి కోల్పోతారని ఆందోళన చేపట్టారు. ఉన్నతాధికారుల ప్రతిపాదనల ప్రకారం నిర్మాణం చేపడతామని అభ్యంతరాలు ఉంటే స్థానిక రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని పేర్కొనడంతో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టవద్దని వేడుకున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చిరువ్యాపారులు నిర్ణయించారు.
ఇవీ చూడండి: 50శాతానికి పైగా హెల్మెట్లేని వారే ప్రమాదానికి గురి..!