షీ టీం పోలీసు సిబ్బందికి కేటాయించిన 20 వాహనాలను ఎస్పీ రంగనాథ్ జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో జెండా ఊపి ప్రారంభించారు. మహిళల రక్షణ ప్రధాన లక్ష్యంగా తెలంగాణ పోలీసు శాఖ పనిచేస్తుందని ఆయన తెలిపారు. అందుకు సంబంధించిన ఆధునిక సౌకర్యాలు కల్పించి మహిళల రక్షణలో రాజీలేకుండా పనిచేస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచామని ఎస్పీ అన్నారు.
ఈ వాహనాల ద్వారా ఇకపై మహిళల రక్షణకు సంబంధించి ఘటన స్థలాలకు మరింత త్వరగా చేరుకునే అవకాశం కల్గుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ అదనపు ఎస్పీ నర్మదా, డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ సహించదు'