ETV Bharat / state

విద్యార్థులు లేకుండానే ప్రారంభమైన పాఠశాలలు - నల్గొండ జిల్లా తాజా వార్తలు

జూన్‌ 12 నుంచి ప్రారంభం కావాల్సిన విద్యాసంవత్సరం కొవిడ్‌-19 వల్ల ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. విద్యాసంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం డిజిటల్‌ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. దూరదర్శన్, టీశాట్, యూట్యూబ్, వాట్సప్‌ తదితర సాంకేతికతను వినియోగించుకుని బోధన అందించాలని సంకల్పించింది. వచ్చేనెల 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో మూడు రోజుల ముందే ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరై ఆన్‌లైన్‌ తరగతులకు విద్యార్థులను ప్రోత్సహించి సన్నద్ధం చేసేందుకు సంసిద్ధమవుతున్నారు.

విద్యార్థులు లేకుండానే ప్రారంభమైన పాఠశాలలు

author img

By

Published : Aug 28, 2020, 11:51 AM IST

ఉపాధ్యాయులు బడిబాట పట్టారు. కరోనా నేపథ్యంలో సుదీర్ఘ కాలం మూతబడిన పాఠశాలలు గురువారం తెరుచుకున్నాయి. విద్యార్థులు లేకుండా పాఠశాలలు ప్రారంభం కావడంతో సందడి లేకుండా బోసిపోయినట్లు కనిపించాయి. జూన్‌ 12 నుంచి ప్రారంభం కావాల్సిన విద్యాసంవత్సరం కొవిడ్‌-19 వల్ల ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. విద్యాసంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం డిజిటల్‌ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది.

దూరదర్శన్, టీశాట్, యూట్యూబ్, వాట్సప్‌ తదితర సాంకేతికతను వినియోగించుకుని బోధన అందించాలని సంకల్పించింది. వచ్చేనెల 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో మూడు రోజుల ముందే ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరై ఆన్‌లైన్‌ తరగతులకు విద్యార్థులను ప్రోత్సహించి సన్నద్ధం చేసేందుకు సంసిద్ధమవుతున్నారు.

కార్యాచరణపై కసరత్తు

డిజిటల్‌ తరగతుల ప్రారంభం నేపథ్యంలో గురువారం పాఠశాలలకు ఉపాధ్యాయులు హాజరయ్యారు. హెచ్‌ఎంల ఆధ్వర్యంలో కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమావేశమై ఆన్‌లైన్‌ తరగతులకు కార్యాచరణపై కసరత్తు చేశారు. విద్యార్థులు డిజిటల్‌ తరగతులు వినేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఉచిత పాఠ్యపుస్తకాలు తీసుకెళ్లని విద్యార్థులను గుర్తించి వారు పుస్తకాలు తీసుకెళ్లేలా చూడాలని నిర్ణయించారు. విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులు వినియోగించుకునేలా ప్రోత్సహించాలని, ఇందుకు వాట్సప్, ఫోన్‌ ద్వారా వారిని చైతన్యపరిచేలా ఉపాధ్యాయులు బృందాలుగా ఏర్పడాలని బాధ్యతలు స్వీకరించాలని తీర్మానించారు. స్థానికంగా ప్రాథమికోన్నత తరగతులు పూర్తి చేసుకున్న విద్యార్థులను గుర్తించి వారిని సంబంధిత ఉన్నత పాఠశాలల్లో చేర్చుకునేలా ఉపాధ్యాయులు కృషిచేయాలని నిర్ణయించారు.

నల్గొండ జిల్లాలో...

జిల్లాలో 77,104 మంది 3 నుంచి 10 తరగతుల విద్యార్థులు ఉండగా 73,656 మంది టీవీ లేదా సెల్‌ఫోన్‌ ద్వారా డిజిటల్‌ తరగతులు వినే అవకాశం ఉందని ఇటీవల సర్వేలో గుర్తించారు. 3వేల పైచిలుకు మందికి టీవీలు,సెల్‌ఫోన్లు గాని లేవని తేల్చారు. వారు కూడా తరగతులు వినేలా తగిన చర్యలు తీసుకోవాలని, దగ్గరలోని స్నేహితుల ఇళ్లలో తరగతులు సద్వినియోగం చేసుకునేలా చూడాలని అధికారులు సూచించారు.

యూనివర్సిటీ పరిధిలో...

మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 27 నుంచి ఫ్యాకల్టి హాజరవుతున్నారు. విశ్వవిద్యాలయం అధికారులు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని ఇప్పటికే కళాశాలల వారిగా లేఖలు పంపించారు. అధ్యాపకులు విధిగా హాజరై విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులు హాజరయ్యేలా ప్రోత్సహించాలి. ఈ-కంటెంట్‌ను సిద్ధం చేసుకుని ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 93 కళాశాలల్లో ద్వితీయ, తృతీయ సంవత్సరం కలిపి 21వేల మంది విద్యార్థులు ఉన్నారు. పీజీలో 5వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థుల ఆన్‌లైన్‌ తరగతులకు సంబంధించి ఈ-కంటెంట్‌ తయారు చేసుకుని విద్యార్థులకు అవగాహన కలిగించాల్సి ఉంటుంది.

ఇంటర్‌లోనూ...

ఇంటర్‌ కళాశాలల్లో సెప్టెంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. టీశాట్, దూరదర్శన్‌ యాదగిరి ఛానల్, యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా పాఠాలు బోధిస్తారు. ఆన్‌లైన్‌ తరగతుల కోసం గురువారం అధ్యాపకులు పిల్లలకు ఫోన్‌ చేసి వివరాలు చెప్పడం ప్రారంభించారు. పూర్తిస్థాయి మార్గదర్శకాలు రాకున్నా ఫోన్‌ ద్వారా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 200 కళాశాలల నుంచి 40 వేల పైచిలుకు విద్యార్థులు ఇంటర్‌ చదువుతున్నారు. విద్యార్థుల సెల్‌ఫోన్‌ నెంబర్లను సేకరించి ఆన్‌లైన్‌ తరగతులపై వారికి అవగాహన కలిగించాలి. సందేహాలు నివృత్తి చేయాల్సి ఉంటుంది.

ఉమ్మడి జిల్లాలో 2.16 లక్షల మంది విద్యార్థులు

ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో మొత్తం 3,091 ప్రభుత్వ పాఠశాలల్లో 2.16 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థులకు డిజిటల్‌ తరగతుల ద్వారా బోధించేందుకు అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తగిన కసరత్తు చేస్తున్నారు. పిల్లలను గ్రూపులుగా చేయడం, వారికి ఆన్‌లైన్‌ తరగతులపై ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వడం, ఎస్‌సీఈఆర్‌టీ ద్వారా ఆన్‌లైన్‌లో వచ్చే వర్క్‌షీట్లను ఎప్పటికప్పుడు విద్యార్థులు పూర్తి చేసేలా చూడటం వంటివి చేపట్టనున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్న వారికి తరగతుల వారీగా వాట్సప్‌ గ్రూప్‌లను ఏర్పాటు చేసి పాఠ్యాంశాలను బోధించనున్నారు.

బృందాలుగా చేసి పర్యవేక్షిస్తాం:

700 మంది విద్యార్థులున్న మా పాఠశాలలో మొదటిరోజు ఉపాధ్యాయులు సమావేశమై చర్చించాం. 10 శాతం మంది ఇంకా పాఠ్యపుస్తకాలు తీసుకెళ్లనందున వారు తీసుకెళ్లేలా సమాచారం అందించాలని, డిజిటల్‌ తరగతుల నేపథ్యంలో విద్యార్థులను బృందాలుగా విభజించుకుని ఎప్పటికప్పుడు వారికి సూచనలు, సలహాలు ఇవ్వాలని, ఆన్‌లైన్‌ తరగతులు వినేలా ప్రోత్సహించాలని ఉపాధ్యాయులంతా తీర్మానించాం. కొత్త విద్యార్థులను పాఠశాలలో చేర్పించుకోవాలని నిర్ణయించాం. సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు పాఠాలు రూపొందించి స్మార్ట్‌ఫోన్లు ఉన్న విద్యార్థులకు చేరవేసే విషయంపై చర్చించాం.

-వెంకటేశ్వర్లు, హెచ్‌ఎం, ప్ర.ఉ.పా., డీవీకే రోడ్, నల్గొండ

99.9% మంది హాజరు:

కరోనాతో బాధపడుతున్న వారు మినహా మిగిలిన ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరయ్యారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 3 నుంచి 10 తరగతులకు చెందిన 77,104 మంది విద్యార్థుల్లో 73,656 మందికి టీవీ లేదా సెల్‌ఫోన్‌ సౌకర్యం ఉంది. 3,454 మందికి అలాంటి సౌకర్యం లేదని సర్వేలో గుర్తించాం. వారు స్నేహితుల ఇళ్లలో తరగతులు వినాల్సి ఉంటుంది. దీనిపై పర్యవేక్షణ చేయాలని ప్రధానోపాధ్యాయులు, అధికారులకు ఆదేశాలిచ్చాం. దూరదర్శన్, టీశాట్‌ ప్రసారాలు సాఫీగా జరిగేలా చూడాలని కేబుల్‌ ఆపరేటర్లకు సూచనలిచ్చారు. సబ్జెక్టు బోధకులు వెబ్‌మీటింగ్‌ ద్వారా సమావేశమమవుతూ విద్యార్థులకు మరింత నైపుణ్యంగా బోధన అందించేందుకు కృషిచేస్తున్నారు. వీడియో పాఠాలు సిద్ధం చేస్తున్నారు. హెచ్‌ఎంలు, ఎంఈవోలకు వెబ్‌మీటింగ్‌ పెట్టి పాఠశాల స్థాయిలో కార్యాచరణపై సూచనలిచ్చాం.

-బి.భిక్షపతి, డీఈవో, నల్గొండ

ఇదీ చదవండి: 'రామోజీ ఫిల్మ్‌సిటీలో వైభవంగా ఈటీవీ రజతోత్సవం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.