అనేక మంది మరణాలకు నల్గొండ జిల్లా నార్కట్ పల్లి-అద్దంకి రహదారి కారణమైంది. ఈ రహదారుల్లో ప్రమాదాలు జరగకుండా జిల్లా పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. జాతీయ రహదారులపై ఎక్కడ పడితే అక్కడ వేగా నిరోధకాలు (స్పీడ్ బ్రేకర్లు) వేయడానికి నిబంధనలు ఒప్పుకోవు.
ప్రమాదాలు జరిగే ప్రాంతాల వద్ద
దీంతో ప్రధాన కూడళ్లు, నిత్యం ప్రమాదాలు జరిగే ప్రాంతాల వద్ద బోలార్డ్సు, రంబుల్స్ స్ట్రిప్స్ (ప్లాస్టిక్‌తో అమర్చారు. వాహనాలు వీటిని ఢీకొట్టినా వంగి యథావిధిగా ఉంటాయి), వైట్ బంప్స్ (జాతీయ రహదారిపై గతుకులతో కూడిన వైట్ పెయింట్)తో వాహనాల వేగాన్ని తగ్గిస్తాయి.
ఇలాంటివి 15 చోట్ల..
అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై నల్లగొండ జిల్లా పరిధిలో 92 కి.మీ. మార్గంలో 15 చోట్ల ఇలాంటివి ఏర్పాటు చేశారు. పోలీసులు ఈ ఏడాది ఆగస్టు నుంచి ప్రయోగాత్మకంగా చేయడం వల్ల గతంలో జరిగిన ప్రమాదాలతో పోలిస్తే ఇప్పుడు చాల వరకు తగ్గాయి. అంతే కాకుండా ఇప్పటి వరకు మరణాలు కుడా నమోదు కాలేదు.
గతంతో పొలుస్తే ప్రమాదాలు తగ్గాయి
హైదరాబాద్-సాగర్ రహదారిలోనూ నిత్యం ప్రమాదాలు జరిగే ఆరు ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండల పరిధిలోని గోపులాయగుట్ట వద్ద వైట్ బంప్స్ వేయడం వల్ల గతంతో పొలుస్తే ప్రమాదాలు చాలా వరకు తగ్గాయని, ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి తొలి దశలో ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల ఈ చర్యలను అమలు చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఏవీ. రంగనాథ్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి : యాదాద్రి కొండపై పలు పురాతన కట్టడాలు కూల్చివేత