నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా డీజే, ఫ్లెక్సీలు, టెంట్ హౌస్ల కమిటీలతో మిర్యాలగూడ డీఎస్పీ సమావేశం ఏర్పాటు చేశారు. నవరాత్రి వేడుకల్లో ఎటువంటి గొడవలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అభ్యంతరకర ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని తెలియజేశారు. అనంతరం ఉత్సవాల్లో పాటించాల్సిన సూచనల పుస్తకాన్ని మిర్యాలగూడ డీఎస్పీ ఆవిష్కరించారు.
ఇదీ చదవండిః అతివేగం: డ్రైవర్ నిర్లక్ష్యానికి 16 మంది బలి