నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని దుబ్బకాల్వ గ్రామస్థులు వినూత్నంగా తెలియజేశారు. తమ గ్రామానికి మునుగోడు నుంచి వచ్చే రోడ్డు ఇటీవల వర్షాలకు బురదతో చాలా ఇబ్బందిగా మారిందని రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఇటీవల నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. సర్పంచ్ ఎన్నికల్లో కూడా తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. అయినా ఇప్పటి వరకు గ్రామానికి ఎటువంటి నిధులు రాలేదు. సర్పంచ్‌కు చెక్ పవర్ లేకపోవడంతో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి : ఆ ఊర్లో బడి.. బస్టాండు... శ్మశానం పక్కపక్కనే