ETV Bharat / state

అద్దంకి- నార్కట్​పల్లి హైవేపై రోడ్డుప్రమాదం - అద్దంకి- నార్కట్​పల్లి

అద్దంకి- నార్కట్​పల్లి హైవేపై జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డుప్రమాదం
author img

By

Published : Aug 16, 2019, 3:20 PM IST

నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో అద్దంకి- నార్కట్​పల్లి హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మిర్యాలగూడకు చెందిన వీరాంజనేయులు, శ్రీనివాస్ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వేములపల్లి మండల కేంద్రంలో కారు ఢీకొట్టింది. వీరాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందగా... తీవ్రగాయాలపాలైన శ్రీనివాస్​ను మిర్యాలగూడ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ఆపకుండా వెళ్లాడు. స్థానికుల సమాచారం మేరకు అప్రమత్తమైన పోలీసులు మాడుగులపల్లి టోల్​గేట్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డుప్రమాదం

ఇవీ చూడండి: రాఖీల యందు ఈ రాఖీలు వేరయా.

Intro:TG_NLG_81_16_road_accident_av_TS10063

contributer : K.Gokari
center :Nalgonda (Miryalaguda)
()

నోట్.......( యాక్సిడెంట్ కు సంబంధించిన విజువల్స్ ఈటీవీ వాట్సాప్ కు పంపించడం జరిగింది గమనించగలరు.)

కారు ద్విచక్ర వాహనం డీ ఇద్దరు మృతి. నార్కట్పల్లి అద్దంకి హైవే పై సంఘటన.

నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో యాక్సిడెంట్ అద్దంకి నార్కెట్పల్లి హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఎల్లంపల్లి వీరాంజనేయులు గూడ పూరి శ్రీనివాస్ వీరిద్దరూ ద్విచక్రవాహనంపై మిర్యాలగూడ నుంచి పని నిమిత్తం వెళ్తుండగా వేములపల్లి మండల కేంద్రంలోని మమత హోటల్ సమీపంలో వెనక నుంచి వస్తున్న కారు ఢీకొని బైక్ పై ప్రయాణిస్తున్న వీరాంజనేయులు కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు కాగా శ్రీనివాస్ తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ యజమానితో పాటు ఆపకుండా వెళ్లడంతో అప్రమత్తమైన పోలీసులు వందకు డయల్ చేసి అప్రమత్తం చేయగా మాడుగుల పల్లి టోల్గేట్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుని వేములపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ఉదయ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. నిందితులపై కేసు నమోదు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

Body:నల్గొండ జిల్లా

Conclusion:మిర్యాలగూడ పట్టణం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.