Boycotted voting in the munugode bypoll: రాష్ట్రంలో అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మునుగోడు ఉపఎన్నిక వేళ మేము ఓటు వేయం అంటూ మొండికేసి కూర్చున్నారు నల్గొండ జిల్లా గుట్టుప్పల్ మండలం రంగంతండా వాసులు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగారు. సమస్య పరిష్కారంపై స్పష్టమైన హామీ వచ్చేవరకు ఓటేసి లేదని ఎన్నికలను బహిష్కరించారు.
గ్రామంలో మౌలిక వసతులు సరిగా లేవని.. సమస్యపై చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వారు వాపోయారు. దీంతో తెరాస నేతలు విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కేటీఆర్ ఆ గ్రామస్తులతో ఫోనులో మాట్లాడి తొలుత పొలింగ్ స్టేషన్కి వెళ్లి ఓటుహక్కు వినియోగించుకోండి.. త్వరలోనే మీ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
ఇవీ చదవండి: