ETV Bharat / state

NSP: శ్రీశైలం, సాగర్‌ జలాశయాలకు వరద.. సాగర్‌ ఎడమ కాల్వకు నీటి విడుదల - నాగార్జున సాగర్​ ఎడమ కాల్వకు నీటి విడుదల

శ్రీశైలం, నాగార్జున సాగర్​ జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. సాగర్‌కు వరద నీరు వస్తుండటంలో సాగర్‌ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. వానాకాలం సాగు కోసం ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. ఎంపీ లింగయ్య, ఎమ్మెల్యే నోముల భగత్‌ ఎడమ కాల్వకు గేట్లు ఎత్తి 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈసారి 10 రోజులు ముందుగానే నీటిని విడుదల చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

NSP: శ్రీశైలం, సాగర్‌ జలాశయాలకు వరద.. సాగర్‌ ఎడమ కాల్వకు నీటి విడుదల

author img

By

Published : Aug 1, 2021, 4:33 PM IST

NSP: శ్రీశైలం, సాగర్‌ జలాశయాలకు వరద.. సాగర్‌ ఎడమ కాల్వకు నీటి విడుదల

శ్రీశైలం జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో 5,04,086 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్‌ఫ్లో 5,30,175 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 883.50 అడుగులకు నీరు చేరింది. శ్రీశైలం జలాశంయ పూర్తి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా.. జలాశయంలో 207.41 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి జలాశయానికి వరద వస్తుండటంతో కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో అధికారులు విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు.

నిండుకుండలా నాగార్జున సాగర్​ జలాశయం

నాగార్జున సాగర్‌ జలాశయం ఇన్‌ఫ్లో 4,14,526 క్యూసెక్కులు ఉండగా.. 36,572 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ జలాశయంలో ప్రస్తుతం 579.20 అడుగులు మేర నీరు చేరింది. జలాశయంలో గరిష్ఠ నీటి నిల్వ 312.04 టీఎంసీలుగా ఉండగా.. ప్రస్తుతం 280.69 టీఎంసీల నిల్వ ఉంది. సాగర్‌కు వరద నీరు వస్తుండటంలో సాగర్‌ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. వానాకాలం సాగు కోసం ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎంపీ లింగయ్య, ఎమ్మెల్యే నోముల భగత్‌ ఎడమ కాల్వకు గేట్లు ఎత్తి 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దశల వారీగా నీటి విడుదల పెంచుతామని అధికారులు అంటున్నారు. నాగార్జున సాగర్ జలాశయానికి భారీ వరద రావడంతో ఎడమ కాలువకు నీటి విడుదల నిర్ణయం తీసుకున్నారు. గతేడాది ఆగస్టు 11న సాగు నీరు ఎడమ కాలువకు ఇచ్చారు. ఈసారి 10 రోజుల ముందుగా నీటిని విడుదల చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గంట గంటకు జలాశయంలోకి వరద ఉద్ధృతి పెరుగతున్నందున సాగర్‌ గేట్లు తెరిచేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు.

ఎగువన ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజ్‌కి 35,526 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. బ్యారేజ్‌ 36 గేట్లు అడుగు మేర ఎత్తి 26,892 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వాటిలో 8,634 క్యూసెక్కుల నీటిని బ్యారేజ్‌ నుంచి కాలువలకు వదులుతున్నారు.

ఇదీ చదవండి: సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల చేయండి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.