ETV Bharat / state

నకిరేకల్ మున్సిపాలిటీ ఛైర్మన్​గా శ్రీనివాస్ ప్రమాణస్వీకారం - nalgonda district recent news

నకిరేకల్ మున్సిపాలిటీ తొలి ఛైర్మన్​గా తెరాసకు చెందిన 19వ వార్డు కౌన్సిలర్ రాచకొండ శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఛైర్​పర్సన్​గా మురారిశెట్టి ఉమారాణి ప్రమాణస్వీకారం చేశారు.

Nakirekal Municipality
రాచకొండ శ్రీనివాస్
author img

By

Published : May 8, 2021, 1:54 AM IST

నల్గొండ జిల్లా నకిరేకల్ పురపాలక సంఘం ఏర్పాటు తర్వాత తొలిసారిగా జరిగిన పుర పొరులో 11 వార్డుల్లో గెలుపొందిన తెరాస ఛైర్మన్​ పీఠం దక్కించుకుంది. 19వ వార్డు కౌన్సిలర్ రాచకొండ శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఛైర్​పర్సన్​గా మురారిశెట్టి ఉమారాణి ప్రమాణస్వీకారం చేశారు. నకిరేకల్​ మున్సిపాలిటీలో మొత్తం 20 సీట్లు ఉండగా.. తెరాస 11 వార్డులు, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ 6 వార్డులను కైవసం చేసుకుంది. కాంగ్రెస్​ రెండు స్థానాల్లో గెలుపొందగా.. ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. అయితే 1వ వార్డు సభ్యుడు బిక్షం రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

మధ్యాహ్నం 3 గంటలకు కొత్త సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. తెరాస నుంచి ముగ్గురు ఎక్స్ఆఫీషియో సభ్యులుగా ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు హాజరయ్యారు. అయితే కెప్టెన్ లక్ష్మీకాంతరావు, బాలసాని లక్ష్మీనారాయణ ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికలో ఓటు నమోదు చేసుకున్నట్లు కాంగ్రెస్ సభ్యులు సహా చట్టం ద్వారా సేకరించిన ఆధారాలను అధికారులకు అందించారు. కాంగ్రెస్ అభ్యంతరాన్ని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారులు వారికి ఇక్కడ ఎక్స్ఆఫీషియో అవకాశం లేదని స్పష్టం చేశారు. తెరాస కౌన్సిలర్లకు ఎమ్మెల్యే లింగయ్య విప్ జారీ చేశారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.