Python In Nalgonda District: నల్గొండ జిల్లాలో చేపల వలకు కొండచిలువ చిక్కింది. నిడమనూరు మండలం జూలకంటివారి గూడెంలో చేపల కోసం గ్రామస్థుడు వల వేయగా.. 10 అడుగుల కొండచిలువ పడింది. దానిని చూసిన గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న అధికారులు కొండ చిలువను సురక్షితంగా గోనె సంచిలో బంధించి తీసుకెళ్లారు. తరవాత దానిని అడవిలో వదలనున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: