హాజీపూర్ కేసుల నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి మరణశిక్ష విధించాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కోరారు. నల్గొండ పొక్సో చట్టం న్యాయస్థానంలో రెండున్నర గంటల పాటు వాదనలు వినిపించిన పీపీ... నిందితుడిని ఏ మాత్రం కనికరించొద్దని సూచించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ శివారులోని బావుల వద్ద ముగ్గురు బాలికలు పాశవిక హత్యాచారానికి గురయ్యారన్న ప్రభుత్వ న్యాయవాది... అందుకు సంబంధించి పోలీసులు అందజేసిన సాంకేతిక ఆధారాల్ని కోర్టుకు వివరించారు. సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాల ప్రకారం అరుదైన కేసుగా పరిగణించాలని కోరారు. అభం శుభం తెలియని ముగ్గురు మైనర్లను దారుణంగా హత్య చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ రెడ్డి నేర చరిత్రను పరిగణలోకి తీసుకోవాలన్న పీపీ... అలాంటి వారు సమాజానికి అవసరం లేదని వాదించారు.
ఇదీ చూడండి: దారుణం... చలిమంటలో వృద్ధురాలి సజీవదహనం