నల్గొండ జిల్లా మిర్యాలగూడ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ప్రతిష్ఠాత్మకమైన శ్రీ అలివేలు మంగ పద్మావతీ సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రాజకీయాలు(trs vs congress) తిష్ట వేశాయి. పాలకవర్గం నియామకంలో రాజకీయ నేతలు(trs vs congress) జోక్యం చేసుకున్నారు. గత పాలకవర్గం గడువు తీరినప్పటికీ సభ్యుల మధ్య సమన్వయ లోపంతో కొత్త కమిటీ ఏర్పాటులో జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో దేవస్థాన పరిసర ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు కౌన్సిలర్లు కొత్త పాలక వర్గాన్ని నియమించి పదవీ బాధ్యతలు కట్టబెట్టారు. కాగా ఏకపక్షంగా కమిటీ ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ తెరాస పార్టీ(trs vs congress) నేతలు ఆందోళనకు దిగారు. పోటీగా మరో కమిటీ ఏర్పాటుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో దేవాలయ ప్రాంగణంలో ఇరువర్గాలు బలప్రదర్శనకు దిగాయి.
గుడి కమిటీని పెద్దల సమక్షంలో ఎన్నుకున్నప్పటికీ కొంతమంది ఇది చెల్లదని అంటున్నారు. కులాలు, మతాలకు దీన్ని అన్వయిస్తున్నారు. సంబంధిత అధికారులే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా రాజకీయ నేతలు వ్యవహరించకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం. - స్థానికుడు, మిర్యాలగూడ
అటు తెరాస ఇటు కాంగ్రెస్ పార్టీ(trs vs congress) ప్రజాప్రతినిధులు ఆలయ ప్రాంగణంలో బాహాబాహీగా తలపడ్డారు. ఒకరిపై మరొకరు దూసుకెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇదిలా ఉండగా దేవాలయ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా పవిత్రమైన స్వామి వారి సన్నిధిలో రాజకీయ ఘర్షణ(trs vs congress)లు చోటు చేసుకోవడాన్ని వెంకన్న స్వామి భక్తులు ఈసడించుకుంటున్నారు.
ఇదీ చదవండి: Bandi Sanjay: బండి సంజయ్కు పార్టీనేతల స్వాగతం.. ఉపఎన్నికపై చర్చ