ETV Bharat / state

సాగర్​లో ప్రలోభాలు... ఓటుకు రూ.1,000-2,000 - నాగార్జునసాగర్​ వార్తలు

నాగార్జునసాగర్​లో ఎన్నికలు సమీపించడంతో అన్ని పార్టీలు ప్రలోభాలకు తెరలేపాయి. నగదు పంపిణీ చేయడంతో పాటు మద్యం ఖర్చులకూ డబ్బులు ఇస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మద్యం నిల్వలు చేరిపోగా, శుక్రవారం రాత్రి డబ్బు పంపిణీ మరింత జోరుగా సాగనుందని సమాచారం.

nagarjunasagar
nagarjunasagar
author img

By

Published : Apr 16, 2021, 8:05 AM IST

విజయం కోసం అధికార తెరాస, ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు భాజపా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఎన్నికలు సమీపించడంతో అన్ని పార్టీలు ప్రలోభాలకు తెరలేపాయి. నియోజకవర్గంలో ఏడు మండలాలుండగా.. ఇప్పటికే మూడు మండలాల్లో ఓ ప్రధాన పార్టీ ఓటుకు రూ.1500 చొప్పున ముట్టజెప్పింది. మరో ప్రధాన పార్టీ తనకు కంచుకోటగా ఉన్న గ్రామాల్లో ఓటుకు రూ.2 వేల వరకు పంచింది. ఒక గ్రామంలో వేయి ఓట్లు ఉంటే 700 ఓట్లకు డబ్బులిస్తున్నారు.

మాకెందుకు ఇవ్వట్లేదని..

అందరికీ ఇచ్చి తమకు ఎందుకు ఇవ్వడం లేదంటూ మాడ్గులపల్లి మండలంలోని ఓ గ్రామంలో రెండు కుటుంబాలు అక్కడి నాయకుడిని నిలదీశాయి. దీంతో ఒక్కో కుటుంబానికి రూ.5 వేల చొప్పున ఇచ్చినట్లు తెలిసింది. నగదు పంపిణీ చేయడంతో పాటు మద్యం ఖర్చులకూ డబ్బులు ఇస్తున్నారు. బూత్‌ల వారీగా లెక్కలు తీస్తూ 600 ఓట్లుంటే రూ.15 వేలు, వెయ్యి ఓట్లు ఉంటే రూ.20 వేల చొప్పున.. మద్యం కోసం స్థానిక బాధ్యులకు ఓ పార్టీ గురువారం రాత్రి డబ్బు పంపిణీ చేసింది. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మద్యం నిల్వలు చేరిపోగా, శుక్రవారం రాత్రి డబ్బు పంపిణీ మరింత జోరుగా సాగనుందని సమాచారం.

ఓటుకు రూ. 1000 చొప్పున..

మరో ప్రధాన పార్టీ తమ అభ్యర్థి వర్గానికి చెందినవారికి రూ.1000 చొప్పున పంపిణీ చేసింది. ఆ పార్టీ నాయకులు గురువారం తెల్లవారుజామున 3 గంటలకు అన్ని మండలాల్లో పంపిణీ మొదలుపెట్టి ఉదయం 6 గంటల వరకు పూర్తి చేశారు. '‘మాకు ఓట్లేసేవారికే ముట్టజెప్పాం. డబ్బులు తీసుకున్న ప్రతిఒక్కరూ ఓటేస్తారనుకోలేం. ఇప్పటి పరిస్థితుల్లో తప్పకుండా డబ్బులు పంచాల్సిందే. లేకపోతే పార్టీ కార్యకర్తలైనా ఓటేయడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు' అని ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఒకరు ఈనాడుతో చెప్పారు. ఎన్నికల్లో పోటీచేస్తున్న మరో రాజకీయ పక్షం ఓటుకు రూ.వేయి చొప్పున పంచేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలిసింది. నియోజకవర్గంలో రెండు లక్షలకుపైగా ఓట్లుండగా కనీసం లక్ష ఓట్లకు డబ్బులు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు.

  • పోటీలో ఉన్న అభ్యర్థులు: 41 మంది
  • పోలింగ్‌ కేంద్రాలు: 346
  • వినియోగిస్తున్న ఈవీఎంలు: 1,446
  • సిబ్బంది: 5,535

ఇదీ చదవండి : మాస్క్‌ మరవొద్దు.. జరిమానా బారిన పడొద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.