అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న మౌంట్పోర్ట్ పాఠశాల గేట్ ముందు ఆందోళన చేపట్టారు.
" రెండు రోజుల క్రితం ఫీజుల గురించి మాట్లాడదామని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం స్కూల్ కి రమ్మని చెప్పింది. పేరెంట్స్ అందరూ వచ్చేసరికి.. పాఠశాల లోపలికి వెళ్లకుండా గేట్ మూసివేసి, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. యాజమాన్యం ముఖం చాటేస్తుంది"
-విద్యార్థుల తల్లిదండ్రులు
పాఠశాల తీరును నిరసిస్తూ.. ఇవాళ ఏబీవీపీ నాయకులు, పిల్లల తల్లిదండ్రులు, ఐద్వా కార్యకర్తలు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. అయినా యాజమాన్యం స్పందించకపోవడంతో... వారంతా ఒక్కసారిగా గేటు నెట్టుకొని వెళ్లడం వల్ల పాఠశాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వచ్చి.. రోడ్డుపై బైఠాయించిన ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి: ఎట్టిపరిస్థితుల్లోనూ లాక్‌డౌన్ విధించం: సీఎం కేసీఆర్