పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 103 జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు నల్గొండ జిల్లా కేంద్రంలోని అంధుల పాఠశాలలో విద్యార్థులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం.రఘునందన్ రావు హాజరయ్యారు. అనంతరం అంధుల పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పుతున్న ఉపాధ్యాయులను రఘునందన్ సన్మానించారు. మానవత్వం మంట కలిసిపోతున్న ఈ రోజుల్లో... అంధులకు మంచి జీవితాన్ని అందించేందుకు అంధుల పాఠశాల నడుపుతున్న చొక్కారావుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పాఠశాలకు తన వంతు సాయాన్ని అందిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చొక్కారావు, దాతలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఉయ్యాలవాడ కుటుంబసభ్యులకు హైకోర్టులో చుక్కెదురు