నల్గొండ జిల్లా హాలియాలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నాగార్జునసాగర్ శాసనసభ్యుడు దివంగత నోముల నర్సింహయ్య గతంలో చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
వచ్చే విద్యాసంవత్సరం 2021-22 నుంచి కళాశాలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు కళాశాల విద్యా కమిషనర్ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి: తెలంగాణకు కోటిన్నర కొవిడ్ టీకాలు.. సర్కారు ప్రణాళికలు