ETV Bharat / state

ఆధునిక వైద్యపరికరాలను ప్రారంభించిన శాసనమండలి ఛైర్మన్

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని ఏరియా ఆస్పత్రిలో ఆధునిక వైద్యపరికరాలను శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రారంభించారు. పేద ప్రజలకు అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. సాగర్ చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వైద్యం కోసం పట్టణాలకు పరుగులు తీయాల్సిన అవసరం లేదన్నారు.

author img

By

Published : Nov 9, 2020, 6:55 PM IST

new  medical equipments started in nagarjunasagar area hospital by gutta sukhender reddy
ఆధునిక వైద్యపరికరాలను ప్రారంభించిన శాసనమండలి ఛైర్మన్

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ ఏరియా ఆస్పత్రిలో 30 లక్షల రూపాయల విలువైన వైద్య పరికరాలను శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రారంభించారు. పేద ప్రజలకు అత్యాధునిక చికిత్స అందించేందుకు డిజిటల్ ఎక్స్‌రే, ఆధునిక ప్రయోగశాల అందుబాటులోకి రావడం సంతోషకరమైన విషయమన్నారు. సాగర్ చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వైద్యం కోసం పట్టణాలకు పరుగులు తీయాల్సిన అవసరం లేదన్నారు.

అనంతరం నందికొండ పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సాగర్‌లో ఉన్న ప్రభుత్వ భవనాన్ని నామమాత్ర ధరకు ఇవ్వాలని పలువురు కౌన్సిలర్లు కోరగా... త్వరలోనే సీఎం నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య, శాసనమండలి సభ్యులు చినపరెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి:జవాన్ మహేష్ కుటుంబానికి మంత్రి ప్రశాంత్ రెడ్డి పరామర్శ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.