నాగార్జునసాగర్ నూతన సీఈగా బాధ్యతలు చేపట్టిన శ్రీకాంతరావు శుక్రవారం సాగర్ జలాశయాన్ని సందర్శించారు. ఈయన కరీంనగర్లో ఎస్ఈగా పని చేసి.. సీఈగా పదోన్నతి పొందారు. ఎస్ఈ ధర్మా నాయక్తో కలిసి సాగర్ క్రస్ట్ గేట్లు, కుడి, ఎడమ కాలువ హెడ్ రెగ్యులెటర్స్ను పరిశీలించారు. సాగర్ కుడి కాలువ 9వ గేటు మరమ్మతుల పనులను డెకమ్ కంపెనీకి అప్పగించినట్లు.. పనులను త్వరలోనే పూర్తి చేస్తారని పేర్కొన్నారు.
సాగర్ జలాశయం క్రస్ట్ గేట్ల లీకేజీలకు రబ్బరు సీలింగ్ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అతి త్వరలో కుడి, ఎడమ కాలువలకు నూతన గేట్లను అమర్చుతామన్నారు. జలాశయం స్పిల్ వేకు మరమ్మతులు చేయడానికి నిపుణుల కమిటీని రప్పిస్తామని.. వారి సూచనల ప్రకారం పనులు చేపడతామని తెలిపారు. నెల్లికల్ లిఫ్ట్ నిర్మాణ స్థలాన్ని కూడా ఆయన ఈఈలు, ఏఈలతో కలిసి పరిశీలించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు