యువత నేతాజీ సుభాష్ చంద్రబోస్ అడుగుజాడల్లో నడవాలని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నల్గొండజిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన నేతాజీ 125వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండలి ఛైర్మన్‌తో పాటు.. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఎస్పీ రంగనాథ్, సమితి అధ్యక్షుడు కర్నాటి విజయ్ కుమార్ హాజరై.. బస్టాండ్ సమీపంలోని నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఒక స్ఫూర్తిగా ..
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 జయంతిని కేంద్ర ప్రభుత్వం పరాక్రమ్ దివాస్ గా నామకరణం చేయటం పట్ల హర్షిస్తున్నట్లు గుత్తా తెలిపారు. నేటి యువతకు బోస్ గారి జీవితమే ఒక స్ఫూర్తిగా ఉండాలని సూచించారు.
ప్రతి రోజు ఉదయం
నేటి నుంచి నల్గొండ పట్టణంలోని పన్నెండు ప్రధాన కూడలులలో ప్రతి రోజు ఉదయం 8:30 జాతీయ గీతాలాపన చేయనున్నట్లు సమితి అధ్యక్షుడు కర్నాటి విజయ్ కుమార్ తెలిపారు.
'భారత దేశ స్వాతంత్య్రానికి బోస్ చేసిన సేవలు ఎప్పటికి మరువలేనివి. దేశ రక్షణకు దేశంలో జాతీయ భావాన్ని పెంపొందించుకోవడానికి బోస్ గారిని ఒక స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగిపోవాలి. నేటి యువతకు బోస్ గారి జీవితమే ఒక స్ఫూర్తిగా ఉండాలి.'
-- గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన మండలి ఛైర్మన్
ఇదీ చదవండి:సీఎం కావడానికి అన్ని అర్హతలున్న వ్యక్తి కేటీఆర్ : దానం