ETV Bharat / state

పుర సమరానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధం

నల్గొండ జిల్లాలో మున్సిపల్‌ పోరుకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పురపాలిక ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయించడంతో అందుకు తగ్గట్లు మున్సిపల్‌ అధికారులు ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు.

పుర సమరానికి సన్నద్ధం
author img

By

Published : Jul 17, 2019, 9:21 AM IST

నల్గొండ జిల్లా పరిధిలోని ఏడు మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన పూర్తిచేశారు. ఎన్నికల సంఘం అదేశాల మేరకు పురపాలికల వారీగా తాజాగా మంగళవారం తుది ఓటర్ల జాబితా విడుదల చేశారు. ఈనెల 17న పోలింగ్‌ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల చేసి, ఫిర్యాదులు, పరిశీలన తర్వాత తుది జాబితాను 21వ తేదీన ప్రకటించనున్నారు. మరో పక్క ఎన్నికల నిర్వహణలో పాలుపంచుకునే అధికారులను నియామకం చేస్తూ విధులు, బాధ్యతలు అప్పగించారు. వారికి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రాదేశిక పోరు మాదిరిగానే బ్యాలెట్‌ పత్రాలతో ఎన్నికలు నిర్వహించనుండటంతో అందుకు కావాల్సిన సామగ్రి కొనుగోలుకు అంచనాలు రూపొందించి ఉన్నతాధికారుల అనుమతులు కోసం ఎదురు చూస్తున్నారు.

పార్టీల గుర్తులతోనే సమరం

ఇటీవల జరిగిన జిల్లా పరిషత్తు, శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో అవలంబించిన మాదిరిగానే ఆయా పార్టీల గుర్తుల ద్వారా మున్సిపల్‌ సమరం జరిపేందుకు ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకొంది. 2014 ఎన్నికల సమయంలో ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించిన విషయం తెలసిందే. ఈ సారి మాత్రం బ్యాలెట్‌ పత్రాలతో నిర్వహించేందుకు సన్నద్ధమైంది. ఇటీవల ప్రాదేశిక పోరుకు ఉపయోగించిన బ్యాలెట్‌ పెట్టెలను మున్సిపల్‌ ఎన్నికలకు ఉపయోగించుకునేందుకు ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించినట్లు సమాచారం. జిల్లా కేంద్రంలోనే అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన బ్యాలెట్‌ పత్రాలను ముద్రించేందుకు కసరత్తు చేస్తున్నారు. అవసరమైతే హైదరాబాద్‌లోను ముద్రించేలా ముద్రణ కేంద్రాల ఆన్వేషణ కొనసాగిస్తున్నారు.

అధికారులకు శిక్షణ

మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణలో విధులు నిర్వహించే అధికారులకు శిక్షణ ప్రారంభమైంది. నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ, చండూరు, హాలియా, చిట్యాల, నందికొండ మున్సిపాలిటీల్లో విధులు నిర్వహించనున్న ఫ్లైయింగ్‌స్కాడ్‌, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తీరును పర్యవేక్షించే అధికారులు, ఖర్చులను లెక్కించే గణంకాధికారులు, సర్వేలెన్స్‌ బృందాలు, సూక్ష్మపరిశీలకుల బృందాలకు శిక్షణ పూర్తి చేశారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో ఎన్నికల అధికారి(ఈవో), సహాయ ఎన్నికల అధికారి (ఏఈవో)లకు శిక్షణ ముగిసింది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన పోలింగ్‌ అధికారి(పీవో), సహాయ పోలింగ్‌ అధికారి (ఏపీవో)లకు నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో బుధవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంకా ఓపీవోలను నియమించాల్సి ఉంది.

ఇదీ చూడండి: మున్సిపల్ ముసాయిదా బిల్లు సిద్ధం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.