ETV Bharat / state

'ధాన్యాన్ని ఆరబెట్టుకొని ఐకేపీ సెంటర్లకు తీసుకురండి'

జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నల్గొండ జడ్పీ కార్యాలయంలో వాడి వేడిగా సాగింది. జడ్పీ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి అధ్యక్షతన పలు అంశాలపై చర్చ జరిగింది. కార్యక్రమంలో ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగు బెల్లి నర్సిరెడ్డి, తెరా చిన్నపు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

nalgonda zp chairman banda narender reddy
జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం
author img

By

Published : Apr 3, 2021, 4:38 PM IST

నల్గొండ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం.. జడ్పీ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల్లోని పలు అభివృద్ధి పనులు, పెండింగ్​లో ఉన్న సమస్యలు, నీళ్లు, పారిశుధ్యం, రోడ్లతో పాటు మౌలిక వసతుల గురించి చర్చ జరిగింది.

అధికారులు ప్రజాప్రతినిధుల మధ్య వాడివేడిగా జరిగిన ఈ సమావేశంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు త్వరగా ప్రారంభించాలని, ఐకేపీ సెంటర్లలో మౌలిక సదుపాయాల కల్పించాలని సభ అధ్యక్షున్ని కోరారు. ఈ నెల 5న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు ఛైర్మన్, వ్యవసాయ అధికారులు తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని 17 శాతం తేమ వచ్చే విధంగా ధాన్యాన్ని ఆరబెట్టుకొని ఐకేపీ సెంటర్లకు తీసుకురావాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: యాదాద్రిపై కరోనా ప్రభావం.. భారీగా తగ్గిన ఆదాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.