Nalgonda Nakrekal Highway Accidents : ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి నకిరేకల్ వెళ్లే రహదారి ఆరు నెలల కిందట వరకు చిన్న రహదారిగా ఉండేది. ఇప్పుడు రెండు లైన్లుగా చేసి రోడ్డును విస్తరించారు. రహదారి వెంబడి గ్రామాల్లో ట్రాక్టర్లు, లారీలు, ట్రక్కులు(Trucks) నిరంతరం రహదారిపైనే నిలిపి ఉంచడంతో వేగంగా వస్తున్న వాహనాలకు మలుపులు కనిపించక పోవడం ప్రమాదాలకు(Accidents) గురౌతున్నారు. ఈ రోడ్డుపై గరిష్ఠంగా 80 కిలోమీటర్ల వేగం వరకు మాత్రమే అనుమతి ఉన్నా.. వాహనదారులు అధిక వేగంతో ప్రయాణించి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. గుత్తేదారు రహదారి నిర్వహణలో అలసత్వం కారణంగా ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
'నల్గొండ నుంచి నకిరేకల్ హైవే ఇంతకముందు ఎంత స్పీడ్‌గా వెళ్లిన ప్రమాదాలు ఏం జరగలేదు. ఇప్పుడు హైవే రహదారి కావడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పుడు వాహనదారులు ఇచ్చినమెచ్చినట్లుగా వెళ్తున్నారు. రహదారి బాగుండడంతో స్పీడ్‌గా వెళ్లి ప్రమాదాలకు గురిచేస్తున్నారు. టర్నింగ్‌లు ఉన్నాయి.. వాహనదారులు అవి కూడా చూసుకోకుండా ఇష్టమొచ్చినట్లు వెళ్తున్నారు. నిన్న కూడా ఇక్కడ ఇద్దరు దంపతులు ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు గమనించి రహదారి మధ్యలో కొంచెం స్పీడ్ బేకర్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.' -స్థానికులు
Warangal Khammam Highway Accidents : ఈ హైవే వైపు వెళ్తున్నారా.. బీ కేర్‌ఫుల్ బ్రో..!
Road Accidents on Nalgonda Nakrekal Highway : గడిచిన ఆరు నెలల వ్యవధిలో నకిరేకల్ నుంచి నల్గొండ వరకు దాదాపు 20 కిలోమీటర్ల పరిధిలో జరిగిన ప్రమాదాల్లో 12 మంది మృత్యువాత పడ్డారు. సుమారు 40 మంది వరకూ గాయాలపాలయ్యారు. ఈ రహదారిపై పానగల్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అదే గ్రామానికి చెందిన విష్ణు, స్వప్న అనే దంపతులు మృతిచెందారు. నెల రోజుల క్రితం తాటికల్ వద్ద గుడివాడకు చెందిన మహేశ్, రిషిత అనే నవ దంపతులు ప్రమాదానికి గురై మరణించారు. మూడునెలల కిత్రం నకిరేకల్ వద్ద జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదం(Two Wheeler Accident)తో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. గ్రామాల వద్ద వేగ నియంత్రణలు, స్టడ్స్, బారికేడ్లు ఏర్పాటు చేయాలని.. రహదారి వెంబడి ఉన్న గ్రామస్థులు కోరుతున్నారు.
'ఈ హైవే రోడ్డు మీద ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. ఇంతకముందు రోడ్లు కొంచెం ఉండడంతో వాహనదారులు కూడా నెమ్మదిగా వెళ్లేవారు. అప్పుడు ప్రమాదాలు అసలు జరిగేవి కాదు. ఇప్పుడు అది కాస్త హైవే అవడంతో స్పీడ్‌గా వెళ్తున్నారు. ఉదయం వాకింగ్‌కి వెళ్లే వారు ఈ ప్రమాదాలకు ఎక్కువగా గురౌతున్నారు. ఎందుకంటే ఉదయం ఎక్కువగా పబ్లిక్ ఉండరని వాహనదారులు వేగంగా వస్తున్నారు. దీంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. అక్కడక్కడ కాస్త స్పీడ్ బేకర్లు వేస్తే కొంచెం ఈ ప్రమాదాలు నివారించవచ్చని కోరుతున్నాం.' -స్థానికులు
Vijayawada National Highway : గజానికో గుంత.. ప్రాణాలు అరచేత..!